Thursday, January 30, 2025

Kandukur | గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 84మంది విద్యార్థులకు అస్వస్థత !

కందుకూరు – గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగిందని సమాచారం. 84 మంది విద్యార్థులకు అస్వస్థత గురయ్యారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని కందుకూరు గురులంలో ఫుడ్ పాయిజన్ జరిగి 84మంది విద్యార్థులకు అస్వస్థత గుర‌య్యారు.. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో మంచం పట్టారట విద్యార్థులు. ఈ విషయాన్ని తొక్కిపెట్టి బయటకు పొక్కకుండా విద్యార్థులను ప్రిన్సిప‌ల్ బెదిరించారు.

వివ‌రాల‌లోకి వెళితే… గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు వడ్డించగా.. వాటిని తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని సమాచారం. హాస్టల్లోనే నర్సు సాయంతో వైద్యం చేయించేందుకు ప్రయత్నించారు ప్రిన్సిపల్. ఈ క్రమంలో కొంత మంది పరిస్థితి సీరియస్ కావడంతో వనస్థలిపురం ఏరియా దవాఖానకు తరలించడంతో బయటకు ఈ విషయం వచ్చింది.

విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు వెంటనే వెళ్లగా గురుకులానికి తాళం వేసి వాళ్లను అడ్డుకున్నారు ప్రిన్సిపల్. ఇక దీనిపై పోలీసులను పిలిపించిన తర్వాత తల్లిదండ్రులను లోపలికి వదిలారు.. కనీసం సమాచారం ఇవ్వక పోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement