Saturday, November 23, 2024

Kammam – అరు గ్యారెంటీలకు వారేంటీ లేదన్న వారిని చిత్తుగా ఓడించాం – ఉప ముఖ్యమంత్రి భట్టి

ఖమ్మం – సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలపై సంతకాలు పెట్టి ప్రతి ఇంటికి పంపించామన్నారు. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పథకాన్ని అమలు చేస్తామన్నారు. 6 గ్యారెంటీల అమలుకు వారేంటీ లేదు అన్న బీఆర్ఎస్ నేతలకు చెంపపెట్టుగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసామన్నారు.. ఖమ్మం లో మహాలక్ష్మి పథకాన్ని , మంత్రులు పొంగులేటి, తుమ్మల తో కలసి నేడు ఆయన ప్రారంభించారు

ఈ సందర్భంగా భట్టి మాట్లడుతూ, ప్రజలు పండగలాగా కార్యక్రమాల్లో భాగస్వామ్యులు అవుతున్నారని తెలిపారు. ఆరోగ్య శ్రీ ని కూడా అమలు చేస్తున్నామన్నారు. రెండు రోజుల్లోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని స్పష్టం చేశారుపాత్రికేయుల సమస్యలపై కూడా పోరాడుతామని, పరిష్కరిస్తామని అన్నారు. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలకు 9 స్థానాలుస్ కాంగ్రెస్ కు ఇచ్చినందుకు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. .

ఈ ప్రభుత్వం ప్రజలకోసం…ప్రతి పధకం మీదే అన్నారు. ప్రారంభించడమే కాదు అమలు చేస్తామన్నారు. సంపదను సృష్టించి ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. ఐటీని అభివృద్ధి చేస్తామని, సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. సంపదలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. ప్రజలు ఆత్మ గౌరవంతో బ్రతికేలా చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామన్నారు. అందరికీ ఆరోగ్య శ్రీ ఉంటుందని తెలిపారు. ఇక్కడున్న మీడీయం ఇరిగేషన్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ జిల్లాకు గోదావరి జలాలు తెస్తామన్నారు. ముగ్గురం కలిసి పనిచేస్తామని తెలిపారు. అర్ధరాత్రి అయినా తమ దగ్గరకు రావచ్చని, పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement