Monday, November 18, 2024

Kamareddy – పాఠశాల వద్ద ఘర్షణ.. సీఐ, ఎస్ఐకి గాయాలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవధాన్ హై స్కూల్ లో చదువుతున్న ఆరేండ్ల చిన్నారిపై అదే స్కూల్లో పిట్ గా పనిచేస్తున్న నాగరాజు లైంగిక దాడికి యత్నం చేసినట్టు ఆరోపణ రావడంతో సమాచారం అందుకున్న విద్యార్థి నాయకులు పాఠశాల యాజమాన్యంతో గొడవకు దిగారు, పాఠశాలలో జరిగిన సంఘటనపై ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వహించడంతో వారిని సస్పెండ్ చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు, ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, కౌన్సిలర్ చిన్నారి కుటుంబానికి అండగా నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాలకు మద్దతుగా నిలిచారు.

జీవన హైస్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని చైర్మన్ డిమాండ్ చేశారు, ఆందోళనకారులు ఎంత చెప్పినా వినిపించకపోవడంతో సిఐ చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నం చేసినప్పటికీ ఫలించకపోవడంతో, డీఎస్పీ నాగేశ్వరరావు అక్కడికి వచ్చి చెప్పిన వినిపించకపోవడంతో మధ్యాహ్న సమయంలో విద్యార్థులకు తల్లిదండ్రులు టిఫిన్ బాక్స్ తీసుకుని వస్తున్న నేపథ్యంలో ఆ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కూడా ఆందోళనలో భాగస్వామ్యం అయ్యారు,

ఒక్కసారిగా పరిస్థితి చేజారిపోతున్న నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి పాఠశాలకు చేరుకొని పరిస్థితులు సమీక్షించారు, ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పాఠశాల ఆవరణంలో, నిజం సాగర్ చౌరస్తా వరకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు , విద్యార్థి సంఘ నాయకులు ప్రిన్సిపాల్ రూమ్ లోకి చొచ్చుక పోవడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుపడడంతో తీవ్ర ఉద్రిక పరిస్థితులు పోలీసులు లాటిఛార్జ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది,

- Advertisement -

పట్టణ సీఐ, ఎస్సై కి గాయాలు

పాఠశాలలో ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది, క్రమంలో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు వేయడంతో చంద్రశేఖర్ రెడ్డి తలకు గాయమైంది, ఎస్సై రాజారాం, లింగంపేట ఎస్సై, కానిస్టేబుల్ కు గాయాలు కావడంతో పోలీసులు లాటిఛార్జ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది, గాయాలైన పోలీసులను ఆస్పత్రికి తరలించారు,

వివిధ జిల్లాల నుండి పోలీసు ఫోర్స్

పరిస్థితి చేయి జరుగుతుందని నేపథ్యంలో చేరుకున్న ఎస్పీ సింధు శర్మ ఆందోళనకారులతో మాట్లాడడం జరిగింది, ఎంత చెప్పినా ఆందోళనకారులు అర్థం చేసుకోలేకపోయారు, వివిధ జిల్లాల నుండి పోలీస్ ఫోర్స్ తెప్పించడం జరిగింది, లయోలా స్కూల్ నుండి పట్టణ స్టేషన్ వరకు ఆందోళన కారులు ర్యాలీగా బయలుదేరారు, ఎంత చెప్పినా వినిపించకపోవడంతో పట్టణ స్టేషన్ దగ్గర ఆందోళనకారులపై లాటి చార్జ్ చేయడం జరిగింది, కామారెడ్డి పట్టణం పోలీస్ పహారా నీడలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement