కామారెడ్డి, జూలై 11 (ప్రభ న్యూస్):- రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం- 2023 సందర్భంగా ప్రకటించిన సేవ పథకాలలో కామారెడ్డి జిల్లా ఎస్పీ బి. శ్రీనివాసరెడ్డికి మహోన్నత సేవ పథకం మంగళవారం ప్రకటించడం జరిగింది. ఇది వరకే ఎస్పీ సేవ, ఉత్తమ సేవతో పాటు ఇండియన్ పోలీస్ మెడల్ కూడా సాధించడం జరిగినది.
ఈ సంధర్భముగా జిల్లా పోలీసు అధికారులు అందరూ ఎస్పీకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఆదే విధముగా అబ్దుల్ మాజీద్, హెడ్ కానిస్టేబుల్ కి ఉత్తమ సేవ పథకం రాగా ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.