Thursday, December 26, 2024

Kamareddy – చెరువులో దూకి ఎస్సై , కానిస్టేబుల్ సహా ముగ్గురి ఆత్మహత్య

కామారెడ్డి నియోజకవర్గ ప్రతినిధి డిసెంబర్ 26 ఆంధ్ర ప్రభ…. కామారెడ్డి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది బిక్కనూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న సాయి కుమార్ బిబిపేట పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి తో పాటు మరో వ్యక్తి చెరువులు దూకి ఆత్మహత్య చేసుకున్నారు

వీరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్నదే ఇప్పటివరకు తెలియలేదు బుధవారం సాయంత్రం నుండి ఎస్ఐ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసులు ఆయన అనుమానం వచ్చింది కామారెడ్డి జిల్లాలోని వడ్లూరు చెరువు ప్రాంతంలో గల పెద్ద చెరువు వద్ద ఎస్సై సాయికుమార్ కారు చెప్పులు కనిపించడంతో పలువురికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా బిక్కనూర్ ఎస్సై సాయికుమార్ కు చెందిన కారుగా గుర్తించారు. గాంధారి మండలానికి చెందిన శృతి బిబిపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని ఆమె ఇంటికి వెళ్లకుండా ఫోన్ స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు.

వీరితో పాటు బీబీపేట సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ సైతం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గజ ఈత గాళ్ళు గాలింపు చర్యలు చేపట్టి ఎస్సై సాయికుమార్ , కానిస్టేబుల్ శ్రుతి తో పాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు వెలికి తీశారు..

ముగ్గురు ఆత్మహత్యలపై పోలీసులు పలుకోనాలలో విచారణ జరుగుతున్నారు. ఎస్సై సాయి కుమార్ తో పాటు మహిళా కానిస్టేబుల్ శ్రుతి మధ్య ఏమైనా ప్రేమ వ్యవహారం ఉండవచ్చు అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement