హైదరాబాద్,ఆంధ్రప్రభ : లైంగిక వేధింపుల ఆరోపణలపై నమోదైన కేసుల్లో కామారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డి.లక్ష్మణ్ సింగ్‌ను పోలీసులు గురువారం నాడు అరెస్టు చేశారు. వైద్యాధికారిణులు వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏడు కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం డీఎంహెచ్‌వోను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. లక్ష్మణ్ సింగ్ తమను ఏడాదిన్నర కాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లు వైద్యాధికారిణులు ఆరోపించిన విషయం తెలిసిందే. వారి ఫిర్యాదు మేరకు లక్ష్మణ్ సింగ్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు మంగళవారం ఐదు కేసులు, బుధవారం మరో రెండు కేసులు నమోదు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement