Tuesday, November 26, 2024

జుక్కల్ ప్రజల్లో దైవ గుణం,సేవ గుణం మొండు – …..కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్

జుక్కల్(కామారెడ్డి)జుక్కల్ ప్రాంత ప్రజల్లో దైవగుణం, సేవాగుణం మొండిగా వుండటం హర్షించదగ్గ విషయమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు,శనివారం ఉదయం జుక్కల్ మండలంలోని ఓ ఫంక్షన్ హల్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,జుక్కల్ యువత ఆధ్వర్యంలో నిర్వహించి రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు,మారుమూల ప్రాంతాల్లో రక్త దానం కోసం యువత ముందుకు రావటం అభినందనీయమని, హెల్మెట్ లేకుండా,అతివేగంగా వాహనాలు నడుపుతూనందున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని కలెక్టర్ జితిష్ వి పాటిల్ అన్నారు,రక్త దాతలు ప్రాణ ధాతలని రెడ్ క్రాస్ ద్వారా ఇక ముందు ముందు ఇంకా సేవ కార్యక్రమలు నిర్వహిస్తామని ప్రతి ఒక్కరు సభ్యులుగా చేరి సేవ కార్యక్రమంలో పాల్గొలన్నారు,రక్త దానం చేస్తున్న యువకుల దగ్గర కెళ్ళి కలెక్టర్ చేతులు తట్టి అభినందించారు,18 సం,,నిండిన యువతి యువకులు అందరు ఓటు హక్కు కల్గివుండలన్నారు,

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్న,కార్యదర్శిసంజీవ్ రెడ్డి,రాష్ట్ర ఎంసీ సభ్యులు రఘు,,కరస్పాండెంట్ నర్సింహారావు, జిల్లా కోశాధికారి దస్థి రాం,కోఆర్డినేటర్ డాక్టర్ విక్రమ్, మెడికల్ ఆఫీసర్ శివాదాస్, టెక్నీషియన్ రఘు,తహసీల్దార్ గంగసాగర్,జుక్కల్ సర్పంచ్ బి.రాములు,ఉప సర్పంచ్ భాను గౌడ్,సింగల్ విండో చైర్మన్ ఎన్ శివానంద్,రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు, గ్రామ యువత పాల్గొన్నారు.రెడ్ క్రాస్ సబేత్వం తీసుకున్న ఏఈఓ సాయి సుమన్ కు కలెక్టర్ సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement