రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లతో ఇప్పటి వరకు 10, 26, 396 మంది లబ్ధి పొందారని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అమలు చేయడంతో తెలంగాణలో బాల్య వివాహాలను అరికట్టగలిగామని స్పష్టం చేశారు. బీసీ సంక్షేమం ద్వారా 4,87,346 మంది, గిరిజన శాఖ ద్వారా 1,21,639 మంది, మైనార్టీ శాఖ ద్వారా 2,10,676, ఎస్సీ శాఖ ద్వారా 2,06,735 మంది లబ్ధి పొందారు. ఈ రెండు పథకాలకు మొత్తంగా రూ. 8,673.67 కోట్ల ఖర్చు చేయడం జరిగింది. బీసీ శాఖ ద్వారా రూ. 4,355 కోట్లు, గిరిజన శాఖ ద్వారా రూ. 975 కోట్లు, మైనార్టీ శాఖ ద్వారా రూ. 1,682 కోట్లు, ఎస్సీ శాఖ ద్వారా రూ. 1,660 కోట్లు ఖర్చు చేశామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital