Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో జోరుగా కల్తీ పాల విక్రయాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కల్తీ పాలు తాగడంతో వామిటింగ్స్, విరేచనాలకు గురయ్యారు వినియోగదారులు. దీంతో కల్తీ పాలు విక్రయిస్తున్న వ్యక్తిపై పోలీసులకు కంప్లేయింట్ చేశారు.
ఖానాపూర్‌లో పాల వ్యాపారి దగ్గర సుదర్శన్ అనే వ్యక్తి పాలు తీసుకున్నాడు. పాలను తీసుకొని టీ చేసుకొని తాగిన కొద్ది సేపటికే వాంతులు, విరేచనాలు కావడంతో పాలను పరీక్షించారు.