ప్రాణాంతకమైన రసాయనాలను వినియోగిస్తూ కల్తీ కల్లును తయారు చేసి విక్రయిస్తున్న 4గురు వ్యక్తులను మంగళవారంనాడు టాస్క్ ఫోర్స్ విభాగం పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ మండలం చామన్ పల్లి గ్రామానికి చెందిన భూసారపు సురేందర్ (38), బోయవాడ కు చెందిన మార్కరాజు (37) గోదాంగడ్డకు చెందిన పొన్నం సతీష్ (24), సప్తగిరి కాలనీకి చెందిన మామిడి రమేష్ (38) లు ప్రాణాంతకమైన రసాయనాలను వినియోగించి కల్తీ కల్లును తయారు చేస్తూ నగరంలోని తిరుమల నగర్ ప్రాంతంలో విక్రయిస్తున్నారు.
కల్తీ కల్లు తయారీ కోసం క్లోరోఫామ్, కుంకుడుకాయ రసం, అమ్మోనియం, చాక్రీన్ పౌడర్, పాటుగా ఇతర రకాల రసాయనాలను వినియోగిస్తున్నారు. 650 యంఎల్ కలిగిన ఒక్కో సీసాను 30 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా పైన పేర్కొన్న వస్తువులతో పాటు నింపి ఉన్న 670 సీసాల కల్తీకల్లు, రవాణాకు ఉపయోగించే టీఎస్ 36 టి 5479 ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కల్తీకల్లు తయారీదారులను వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు బి మల్లయ్య కె సృజన్ రెడ్డి, ఎస్ఐలు అంజయ్య, నరసింహారావు, రఘుపతి లతోపాటుగా సిబ్బంది పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..