ములుగు ప్రభ న్యూస్ : ప్రజా కవి కాళోజీ సేవలు మరువలేనివని ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. జిల్లా పరిషత్తు కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 19వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జగదీష్ పులా మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణ రావు నిజాం నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కలం ఎత్తిన గొప్ప యోధుడు అని అన్నారు.పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు, వైతాళికుడు మన కాళోజీ నారాయణ రావు అని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ,ములుగు పట్టణ అధ్యక్షులు చెన్న విజయ్ కుమార్,ఏటూరునాగారం ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య,ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్,సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్,తాహిర్ పాషా,వేల్పురి సత్యనారాయణ,యువజన నాయకులు పొలం శ్రావణ్, టిఆర్ ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు
తదితరులు పాల్గొన్నారు.
కాళోజీ సేవలు మరువలేనివి..
Advertisement
తాజా వార్తలు
Advertisement