Friday, November 22, 2024

Kaleswram Projectలో అవినీతి నిజం…50 టిఎంసి నీళ్ల‌కు ల‌క్ష కోట్ల ఖ‌ర్చా…బిఆర్ఎస్ ను నిల‌దీసిన మంత్రులు ..

మేడిగ‌డ్డ – కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అక్క‌డికి చేరుకున్నారు. అనంత‌రం హెలికాప్ట‌ర్ లో మేడిగ‌డ్డ ప్రాజెక్ట్ ను ప‌రిశీలించారు. మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ వంగడం, పిల్లర్లు పగలడం, అన్నారం బ్యారేజీలో సిపేజ్లు ఏర్పడడం, ప్రాజెక్టు డిజైన్ లోపాలు వంటి పలు అంశాలు రాష్ట్ర ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్ కుంగింది, నవంబర్ 30 న ఎన్నికలు జరిగితే, డిసెంబర్ 3న ఫలితాలు వచ్చాయి. డిసెంబర్ 7వరకు కేసీఆర్ సీఎం గా ఉన్నారని. కానీ కాళేశ్వరం పై ఒక్కసారి మాట్లాడలేదని, ఇది చాలా సిగ్గుపడాల్సిన సంఘటన అని, అన్ని విషయాలు నిర్దారణ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. కాళేశ్వరం పై మా పార్టీ విధానం ఒకటే.. ప్రాణహిత చేవెళ్ల ని 35 వేల కోట్లతో నిర్మించాలి అనేది మా విధానం అన్నారు. కానీ ప్రాజెక్టు కట్టే పనిలో ఉండగా ప్రభుత్వం మారిందన్నారు. మా ప్లాన్ మార్చేసి.. ప్రాజెక్టు లొకేషన్ బీఆర్ఎస్ మార్చిందని అన్నారు. పదేళ్ళలో ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. 35 వేల కోట్ల తో మేము కట్టాలి, . కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లకు ఖర్చు పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రారంభం నుంచి మాకు అనుమానాలు ఉన్నాయన్నాయని అన్నారు. నిజానిజాలన్నింటినీ మీడియా కు వెల్లడిస్తామని, మూడేళ్లలో ఈ ప్రోజెక్ట్ కుంగటం సిగ్గు చేటని, దీన్ని ఎవరు నిర్మించారో వారే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కాళేశ్వరంతో వడ్డీల భారం తప్పితే ఎలాంటి ప్రయోజనం లేదు. త్వరలోనే కాళేశ్వరంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తాం” అని తెలిపారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణం తుగ్ల‌క్ చ‌ర్యే – కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి..

ప్రాజెక్టుల నిర్మాణం కోసం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసలు ఇంజినీర్ల సలహాలు తీసుకున్నారా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టులను ఇంజినీర్ల సలహాలు తీసుకొని కట్టారా? లేక కేసీఆరే స్వయంగా చీఫ్ ఇంజినీర్‌గా డిజైన్ చేశారా? ప్రజలకు తెలియాలన్నారు. సాధారణంగా కిందకు వెళ్లే నీటిని… బ్యారేజీ కట్టి పైకి తీసుకు వచ్చి మళ్లీ కిందకు వదలడం తుగ్లక్ చర్య అన్నారు.

అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఆశ్చర్యం వేసిందన్నారు. అసలు ఇలాంటి ప్రాజెక్టు కట్టమని చెబితే మీరు (ఇంజినీర్లు, అధికారులను ఉద్దేశించి) సెలవు పెట్టి వెళ్లవలసింది… అని సూచించారు. అసలు ఏం పిచ్చి ప్రాజెక్టు ఇది అని వ్యాఖ్యానించారు. అసలు ఇక్కడ మూడో టీఎంసీ అవసరమే లేదన్నారు. ముఖ్యమంత్రి అయినా… మంత్రులు అయినా… ఎవరు ఉన్నా ప్రజల కోసం ఇంజినీర్లు తప్పును తప్పుగా చెప్పాల్సిందే అన్నారు. మీరు ప్రజలను కాపాడాల్సిన వారు అని ఇంజినీర్లతో అన్నారు. ప్రాణహిత, గౌరవెల్లి ప్రాజెక్టులు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో వాటిని పక్కన పెట్టారన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే అధికారులు సెలవు పెట్టి వెళ్లాలన్నారు.

- Advertisement -

కొండపోచమ్మ ఎప్పటికీ నీరు ఉంటుందని… కానీ అక్కడి నుంచి ఫామ్ హౌస్‌కు తప్ప ఎక్కడకూ నీరు వెళ్లడం లేదన్నారు. ఇంత ఖర్చు చేస్తే అసలు ఎంత ఆయకట్టుకు నీరు వచ్చింది? అని ప్రశ్నించారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం కోసం ఎంత విద్యుత్‌ను ఉపయోగించారు? అని ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగినప్పుడు గత ప్రభుత్వం ఎందుకు స్పష్టతను ఇవ్వలేకపోయిందన్నారు. రైతులకు వీటికి సంబంధించి స్పష్టమైన సందేశం పంపించాల్సి ఉందన్నారు.

త‌ప్పు ఎలా జ‌రిగిందో ప్ర‌జ‌ల‌కు తెల‌వాల్సిందే – దుద్దిళ్ల

తమకు ఎవరి మీద వ్యక్తిగత కోపం లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. అసలు తమ వద్ద మూడు బ్యారేజీలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని… తాగు, సాగునీటికి ఇబ్బంది అవుతోందన్నారు. మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోవడం… అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో బుడగలు రావడం తెలిసిందేనని… ఈ క్రమంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఏం జరిగిందో తెలుసుకోవాల్సి ఉందన్నారు.

50 టిఎంసి నీళ్ల‌కు ల‌క్ష కోట్లు ఖ‌ర్చా.. పొంగులేటి..
గత ప్రభుత్వం నిర్మాణంలో రూల్స్​ పాటించనందుకే కుంగి పోయిందని మంత్రి పొంగులేటి అన్నారు. టాప్​ లాగ్​ గేట్స్​ పనిచేయకపోయినందుకే కుంగిపోయిందన్నారు. తన మార్కు కనిపించాలనే ఉద్దేశంతోనే మేటిగడ్డ బ్యారేజ్​ ను నిర్మించారన్నారు. ఈ ప్రాజెక్ట్​ ఖర్చు ప్రతి పైసా కూడా అప్పు చేసి గత ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఇప్పుడు ఆ సొమ్ముకు మార్కెట్​ రేటు కంటె 12 శాతం ఎక్కువ వడ్డీ కడుతున్నామ్నారు. లక్ష కోట్లతో 50 టీఎంసీలు ఎత్తిపోస్తున్నారున్నారు. మేడిగడ్డ నష్టాన్ని ఏజన్సీతో కట్టిస్తారా లేదా అని బీఆర్​ఎస్​ నేతలను ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రజలపై ఎంత భారం పడుతుందో ఆలోచించలేదన్నారు. ఇది ఒక్క పిల్లర్​ తో ఆగేదని కాదన్నారు. కాళేశ్వరం డ్యామేజ్ కావడం దురదృష్టకరమన్నారు. లక్షల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులకు బిల్డర్లదే బాధ్యత అని అన్నారు. ఇంత భారీ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను బయటపెడతామన్నారు. మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోవడంతో నీటిని నిల్వ చేసుకోలేకపోతున్నారు. నదిలో నీటిని దిగువకు విడుదల చేయాల్సిందేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణంలో గత ప్రభుత్వ హయాంలో 67 వేల 406 కోట్ల రూపాయిల అవినీతి జరిగిందని మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. మేడిగడ్డలో నీరు నిల్వ చేస్తే నీళ్లు నిల్వ చేసిననప్పుడు ఊళ్లు ముంపునకు గురవుతున్నాయి.కాళేశ్వరం అవినీతిని వెలికితీస్తామని అన్నారు. ప్రాజెక్ట్​ పై రూపాయి ఖర్చు చేస్తే 50 పైసలు రాబడి మాత్రమే ఉందన్నారు. భారీ వర్షాలకు పంప్​ హౌస్​ లు ముంపునకు గురయ్యాయన్నారు. సాంకేతిక లోపం ఎవరి నిర్ణయాల వల్ల వచ్చిందని ప్రశ్నించారు. 3వ టీఎంసీ పనులను నామినేషన్​ పై ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement