Wednesday, November 20, 2024

Kaleswaram Project – జలసౌధలో ముగిసిన విజిలెన్స్‌ సోదాలు…

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ జలసౌధలో విజిలెన్స్‌ అధికారుల సోదాలు ముగిశాయి. దాదాపు 8గంటల పాటు తనిఖీలు చేపట్టిన అధికారులు పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకుని వెంట తీసుకెళ్లారు.

విజిలెన్స్‌ ఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఉదయం 9గంటల సమయంలో జలసౌధకు వచ్చిన అధికారుల బృందం.. కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ ఎండీ హరిరామ్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, రామగుండం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. సంబంధిత సిబ్బంది ఛాంబర్లలో డాక్యుమెంట్లను పరిశీలించారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై దృష్టి సారించిన అధికారులు ఆనకట్ట డిజైన్లు, నాణ్యతకు సంబంధించిన రికార్డులు తనిఖీ చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న రుణాలపై కూడా దృష్టి పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement