Friday, November 22, 2024

MLC Jeevan Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు అది కమిషన్ ప్రాజెక్ట్

కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు అది కమిషన్ ప్రాజెక్ట్.. మిషన్ భగీరథ తో జనాలకు ఒరిగింది ఏమి లేదు.. అనవసర ప్రాజెక్ట్ లు కట్టి రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టారు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిప‌డ్డారు. తెలంగాణ శాసనమండలిలో అసెంబ్లీలో గవర్నర్ ప్రంసగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రాబ్లమ్ అవుతుంది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలకు ఇవ్వడం రాష్ట్రంలో ఉత్పత్తి చేసినట్లు కాదు.. తెలంగాణ వచ్చిన తరువాత కూడా జనాల బతుకులు మారలేదు.. మా ప్రాంతంలో జనాలు బతకడానికి ఇంకా గల్ఫ్ కి వెళుతున్నారు.. గత ప్రభుత్వంలో గల్ఫ్ కార్మికులు కట్టిన ట్యాక్స్ లు తీసుకున్నారు.. కానీ వాళ్ళు గల్ఫ్ దేశాల్లో చనిపోతే వాళ్లకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు అంటూ ఆయన చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై వెంటనే దృష్టి పెట్టాలి.. కృష్ణా నీటిని అక్రమంగా తరలిస్తున్నా.. చూస్తూ కూర్చుంటే ఎలా.. గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో మన హక్కులను పరిరక్షించలేదు అని ఆయన తెలిపారు.

గత ప్రభుత్వం లేఖలకే పరిమితం అయింది అంటూ విమర్శలు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్ట్, మిషన్ భగీరథపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ఎల్టీఐఆర్ ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి రాలేదు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అడ్డుపడినారు. ఇక, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ ను ఎందుకు తీసుకు రాలేక పోయారు?.. 4 వేల మెగావాట్ల ఉచిత విద్యుత్ కేంద్రం నుంచి రావాల్సి ఉంది.. దాన్ని కాదని నాటి ముఖ్యమంత్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం చేపట్టారు అంటు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

బొగ్గు ఉత్పత్తి అయ్యే రామగుండంలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా నల్గొండ దామరచర్లలో ఎందుకు ఏర్పాటు చేశారు?.. ఉద్యమ నాయకుడు, నాటి ముఖ్యమంత్రి రాష్ట్రానలన్ని అప్పుల ఊబిలో నెట్టాడు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకుంటామని చెప్పి కనీసం పట్టించుకోలేదు.. మండలి చైర్మన్ మీకు ఎంత టైం కావాలో చెప్పండి అంత టైం ఇస్తాము.. నన్ను అక్కడికి పంపిస్తే అయిపోవు కదా మీరు నిమ్మలంగా ఉండే వాళ్ళు.. చైర్మన్ మిమ్మల్ని అక్కడికి పంపిన మళ్ళీ ఇక్కడికే వచ్చే వారు కదా.. జనాలు ఎక్కడ ఉండాలని ఆశీర్వాదం ఇస్తే అక్కడ ఉంటాను.. నా బాధ్యత నేను నిర్వహిస్తానంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement