హైదరాబాద్, : తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుకు బడ్జెట్‌లో అగ్రాసనం వేసి ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ కొలిక్కితెచ్చారు. దేశంలోనే సాగునీటి ప్రాజెక్టుల్లో రారాజుగా పేరు తెచ్చు కున్న కాళేశ్వరం ఎత్తిపోతలకు భారీ నిధుల కేటాయించి.. రికార్డు సమయంలో ఎత్తిపోతలు పారించారు. ఆయకట్టు భూముల్లోకి జలసిరులు పంపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కారణంగా ఆయకట్టు సామర్ధ్యం గణనీయంగా పెరగ్గా, మేడిగడ్డ నుండి కొండపోచమ్మ సాగర్ దాకా జలసిరులు పొంగుతున్నాయి. రూ.85 వేల కోట్ల వ్యయ అంచనాతో రూపొందించిన ప్రాజెక్టులో.. ఇంకా మల్లన్న సాగర్, నిజామాబాద్ జిల్లా ప్యాకేజీలు, యాదాద్రి జిల్లాలోని గంధమల్ల, బస్వాపూర్ పనులు జరగాల్సి ఉంది. 18లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, మరో 18 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణకు ఈ ప్రాజెక్టును చేపట్టగా, ఆయకట్టు రికార్డుస్థాయిలో పెరిగింది. మూడు ఆనకట్ట లకు తోడు పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, కాల్వలు నిర్వహణ సవాల్‌గా మారడంతో నీటి నిర్వహణకు ఆధు నిక డెసిషన్ సపోర్ట్ సిస్టం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జలాశయంలో ఎంతనీరు ఉన్నది, ఆయకట్టుకు ఎంతనీరు అవ సరం, భూగర్భజలాల పరిస్థితి, వర్షపాతం నదుల ద్వారా ఎంత పరిమాణంలో నీరు వస్తుంది తదితర సమస్త సమాచారం ఈ సిస్టమ్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ అత్యాధునిక వ్యవస్థకు సంబంధించి వాసర్ ల్యాబ్స్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఇప్పటికే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాగా, ఈ ఏడాది వర్షాకాల సీజన్‌లో సిస్టం బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ఇటీవల నల్లగొండ జిల్లా హాలియా సభలో త్వరలో గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లు పూర్తయి, ఆయక ట్టుకు నీరందుతుందని ప్రకటించారు.
ఈ ఏడాది బడ్జెట్‌లో పెండింగ్ పనులకు నిధులకు కేటాయించి.. పూర్తి చేయాలని, యాదాద్రి జిల్లాకు పూర్తిస్థాయిలో నీరందించాలని సీఎం నిర్ణయించారు. ఇక మల్లన్నసాగర్ పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్‌ది కీలకఘట్టం కాగా, 50 టీఎంసీల సామర్థ్యం గల ఈ మెగా రిజర్వాయర్ ఇటు మెదక్, అటు నిజామాబాద్, మరోవైపు హైదరాబాద్‌కు భరోసానిచ్చే జలనిధిగా ఉండనుంది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి.. ఒత్తిళ్ళకు లొంగకుండా భావితరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం ఈ రిజర్వాయర్ నిర్మాణానికి నిర్దేశించారు. మొత్తంగా కాళేశ్వరం పెండింగ్ పనులన్నీ ఈ ఏడాదే పూర్తిచేసే యోచనలో ప్రభుత్వ వర్గాలున్నాయి. 3వ టీఎంసీ పనులకు సంబంధించి కేంద్ర జల సంఘం ఆదేశాలతో కొంత బ్రేక్ పడింది.
రారాజు కాళేశ్వరం…
Advertisement
తాజా వార్తలు
Advertisement