వారం రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీగా ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరుగుతుండడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కాళేశ్వరం, కడెం ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. అప్రమత్తమైన అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు 30 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు సైతం భారీగా వరద నీరు వచ్చి నీటి మట్టం పెరగడంతో ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
కాళేశ్వరం ప్లాజెక్టు..
మేడిగడ్డ ఇన్ ఫ్లో 33,00 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 61,490 క్యూ సెక్కులు
30 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
కడెం ప్రాజెక్టుకు వరద నీరు
ఇన్‌ఫ్లో 21,143 క్యూ సెక్కులు
ఔట్ ఫ్లో 6,484 క్యూ సెక్కులు
ఒక గేటు ఎత్తి దిగువకు నీటి విడుదల