Wednesday, November 20, 2024

MBNR: కళాభారతి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి… కలెక్టర్ రవినాయక్

మహబూబ్ నగర్, ఆగస్టు 24 (ప్రభ న్యూస్) : మహబూబ్ నర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆవరణలో చేపట్టిన కళాభారతి పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ ఆదేశించారు. గురువారం ఆయన కళాభారతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్వామి, డిప్యూటీ ఇంజనీర్ సంధ్యలు కళాభారతి పనుల పురోగతిని దగ్గరుండి జిల్లా కలెక్టర్ కు చూపించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… కళాభారతి పనులు నత్తనడకన నడుస్తున్నాయని, అందువల్ల ఎక్కువ మంది కూలీలను ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైతే ఎక్కువ యంత్రాలను ఏర్పాటు చేసి పనుల వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కళాభారతి పై భాగంలో నిర్మిస్తున్న షెడ్డు పనులు వారం రోజుల్లో పూర్తి చేస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కె సి నర్సింహులు, ఆర్ అండ్ బీ ఏఈ, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement