Friday, November 22, 2024

జనగామలో కాకతీయ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు.. ఎప్ప‌ట్నుంచి అంటే..

జనగామ క్రైమ్, (ప్రభ న్యూస్) : జనగామ జిల్లా కేంద్రం లో బతుకమ్మ కుంట మైదానంలో కాకతీయ రాష్ట్ర స్థాయి కబడ్డి పోటీలకు సంబంధించి వరంగల్ కమిషనరేట్ తరుణ్ జోషి, వెస్ట్ జోన్ జనగామ పోలీసులతో కలసి క్రీడా స్థలిని పరిశీలించారు.ఆయన లాంఛనంగా క్రీడలను ప్రారంభించారు. ఈ కబడ్డీ పోటీలు జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్,ఫిజికల్ టీచర్స్ అసోసియేషన్ సంయుక్త పర్య వేక్షణలోవెస్ట్ జోన్ పోలీస్ జనగామ వారి నిర్వహణ సారధ్యంలో తేదీ 07 12 2021 మొదలుకొని 09.12.2021 వరకు జరుగానున్నాయని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా తరుణ్ జోషి ఐ పీఎస్, వరంగల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఆయన వెస్ట్ జోన్ డిసిపి శ్రీనివాస్ రెడ్డి ,ఏసీపీ గజ్జి కృష్ణ ,స్థానిక సి ఐ బాలాజీ వర ప్రసాద్,ఎస్ ఐ లు,పోలీస్ సిబ్బంది తో కలసి క్రీడా మైదానాన్ని పరిశీలించారు.అనంతరం వారితో కలిసి ఆయన ఈ నెల 7 నుండి తేదీ 10 తేదీవరకు నివహించనున్న కబడ్డీ పోటీలకు సంబంధించి గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డి సి పి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాదించలేకపోయామని,ఈ సారి అలా కాకుండా అన్ని స్థాయిల్లో విజయం సాదించి జనగామ జిల్లా పేరును నిలబెట్టాలని కోరారు.ఈ క్రీడల నిర్వహణలో ప్రముఖ పాత్ర వహిస్తున్న కోచ్ లను డిసిపి తరుణ్ జోషి కి పరిచయం చేశారు.కార్యక్రమంలో జి రమేష్ వర్ధన్నపేట,స్టేషన్ ఘన్పూర్ రఘు చందర్,ఎస్.ఐ లు అధికారులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement