Friday, November 22, 2024

దళితబంధు అమలు కాకపోతే టీఆర్ఎస్ కు ఓటమే: కడియం శ్రీహరి

దళిత బందు పథకంపై టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధును పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే టీఆర్ఎస్ కే నష్టమని ఆయన అన్నారు. ఈ పథకాన్ని అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. అయితే ఒకే ఏడాదిలో 15 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హుజూరాబాద్‌లో ఉపఎన్నిక వేళ.. కడియం శ్రీహరి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

కాగా, ఆగస్ట్ 16న ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని ప్రాంభించనున్న సంగతి తెలిసిందే. హుజూరాబాద్ సభలో కొందరు లబ్ధిదారులకు సీఎం  కేసీఆర్ చెక్కులను అందించనున్నారు.

ఇది కూడా చదవండిః మునుగోడు కోసం కోమటిరెడ్డి సంచలన ప్రకటన

Advertisement

తాజా వార్తలు

Advertisement