Monday, November 25, 2024

అంతారంలో అలరించిన కబ‌డ్డీ పోటీలు

తాండూర్ మండలం అంతారం గ్రామంలో గత మూడు రోజుల నుంచి పట్నం మహేందర్ రెడ్డి యువసేన కబడ్డీ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన క‌బ‌డ్డీ పోటీలు ఉత్స‌హంగా ముగిశాయి. మూడు రోజులుగా ఆక‌ట్టుకున్న ఈపోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి 15 కబడ్డీ జ‌ట్లు పాల్గొన్నాయి. మూడో రోజు అంతారం, షాపూర్ తాండ జ‌ట్లు తలపడగా షాపూర్ తండా ఫైనల్‌కు చేరుకుంది. అప్ప‌టికే ఫైన‌ల్‌కు చేరిన కొడంగల్ జ‌ట్టుతో షాపూర్ తాండా జ‌ట్టు పోటీ ప‌డ్డాయి. ఉత్కంఠ‌గా కొన‌సాగిన పోటీలో కోడంగల్ జ‌ట్టు విజేతగా నిలవ‌డంతో షాపూర్ తాండ జ‌ట్టు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది.

పోటీల్లో విన్న‌ర్, ర‌న్న‌రప్ జ‌ట్ల‌కు ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్ట‌ర్, తాండూరు మండ‌లం ఎల్మ‌క‌న్నె స‌హాకార సంఘం చైర్మ‌న్ సంగెం ర‌వీంద‌ర్ గౌడ్ స‌హాకారంతో మొద‌టి బ‌హుమ‌తి రూ. 10వేలు, రెండో బ‌హుమ‌తిగా రూ. 5వేలను ప్ర‌క‌టించారు. తాండూరు మార్కెట్ క‌మిటి మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, అంతారం ఎంపీటీసీ శాంతు, టిఆర్ఎస్ నేతలు ఎస్ రాజ్ పటేల్, డేవిడ్, రజినీకాంత్, పెద్దేముల్ వైస్ ఎంపీపీ లక్ష్మణ్, అంతారం పట్నం మహేందర్ యువసేన కబడ్డీ టీం ఆధ్వర్యంలో విజేతలకు నగదుతో పాటు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… యువ‌కుల్లో క్రీడా స్పూర్తిని పెంపొందించేందు కు క‌బ‌డ్డీ పోటీలు నిర్వ‌హించిన మ‌హేంద‌ర్‌రెడ్డి యువ‌సేన స‌భ్యుల‌ను అభినందించారు. ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి స‌హాకారంతో క్రీడాకారుల అభివృద్దికి స‌హ‌కారం అందిస్తామ‌ని పేర్కొన్నారు. ప‌లువురు క్రీడాకారులు మాట్లాడుతూ… ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఆయ‌న స‌హాకారంతో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించాల‌ని, క్రీడా పోటీల‌తో క్రీడాకారులు ఉన్నత శిఖరాలకు ఎదిగేలా ప్రోత్స‌హించాల‌ని కోరారు. క్రీడా పోటీల్లో విజేత‌ల‌కు, ర‌న్న‌ర‌ఫ్ జ‌ట్టుకు న‌గ‌దు బ‌హుమ‌తిని ప్ర‌క‌టించిన ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్, తాండూరు ఎల్మ‌క‌న్నె స‌హాకా సంఘం చైర్మ‌న్ ర‌వీంద‌ర్ గౌడ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement