(ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంధ్ర ప్రభ) : సమన్యాయ సత్యశోధకుడు జ్యోతిరావు ఫూలే అని మెదక్ కాంగ్రెస్ సీనియర్ నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం జ్యోతిరావు ఫూలే వర్ధంతి పురస్కరించుకుని చిట్కుల్ లోనీ నీలం మధు నివాసంలో ఫూలే చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.
ఆయన మాట్లాడుతూ… అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు విద్య, మహిళోద్ధరణకు కృషి చేసిన గొప్ప వ్యక్తి ఫూలే అని, ఆయన దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేసి అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్య కోసం పనిచేశారని గుర్తుచేశారు. ఆయన బాట సమాజానికి అనుసరణీయమని నీలం మధు అభిప్రాయపడ్డారు.
- Advertisement -