బాల నేరస్తుల కేసులను విచారించే జువియల్ కోర్ట్ ను హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఈ.వి.వేణుగోపాల్ ప్రారంభించనున్నారు. కరీంనగర్ కోర్ట్ సముదాయంలో ఈ జువియల్ కోర్ట్ ను ఏర్పాటు చేశారు. న్యాయమూర్తి ఈ వి వేణుగోపాల్ ఇవ్వాల (శనివారం) కొత్తగూడెం, భద్రాచలం పర్యటన ముగించుకుని రాత్రి కరీంనగర్ కు చేరుకొని రాంనాగర్ లోని స్వగృహంలో బస చేశారు. ఇక రేపు (ఆదివారం) ఉదయం 11 గంటలకు జువియల్ కోర్ట్ ను ప్రారంభించి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.