Friday, January 24, 2025

KHM | కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం… కాంగ్రెస్ నేత‌లు

ములకలపల్లి, జనవరి 23(ఆంధ్రప్రభ) : కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో అంద‌రికీ న్యాయం జ‌రుగుతుంద‌ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు బత్తుల అంజి అన్నారు. ములకలపల్లి మండలంలోని ములకలపల్లి గ్రామ పంచాయతీలో గురువారం ప్రజాపాలన గ్రామ సభలో వారు మాట్లాడుతూ… ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరం జరుగుతుందన్నారు.

ములకలపల్లి రైతు వేదిక కార్యాలయంలో జరిగిన ప్రజా పాలన గ్రామసభలో వారు పాల్గొని గ్రామ ప్రజలతో, లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించారు. అధికారులు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరపాలన్నారు. జాబితాలో పేర్లు రానివారు దరఖాస్తు చేసుకోవాలని, అర్హులు ఎంతమంది ఉన్నా వారి పేర్లను చేర్చేందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తప్పకుండా ప్రతి ఒక్క లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. ఈ సభలో నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement