Friday, November 22, 2024

లంచంతో ఏసీబీకి పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్..

జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘ‌త‌న‌ తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో పనిచేసే జూనియర్‌ అసిస్టెంట్‌ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. మండలంలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన బొంగోని అంజయ్యగౌడ్‌ తండ్రి 2005లో మరణించాడు. ఆయన పేరుపై ఉన్న స్థిరాస్తి మార్పిడి గురించి తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం కోసం తహసీల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ధ్రువీకరణ పత్రం కోసం జూనియర్‌ అసిస్టెంట్‌ రాజా కిషన్‌ను సంప్రదించగా తనకు వెయ్యి రూపాయలు ఇస్తేనే ధ్రువీకరణ పత్రం అందజేస్తానని నెలరోజులుగా ఇబ్బందుల పాలు చేశాడు. దీంతో విసిగివేసారిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో జూనియ‌ర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. తహసీల్‌ కార్యాలయంలో రూ. వెయ్యి అందిస్తుండగా ఏసీబీ డీఎస్పీపీ భద్రయ్య ఆధ్వర్యంలో దాడులు చేసి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement