Tuesday, November 26, 2024

Jumping MLA’s – ఆ 12 మందిపై కాంగ్రెస్ గురి ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: పార్టీ గుర్తుతో గెలిచి ఆ తర్వాత అధికార పార్టీ తీర్ధం పుచ్చుకున్న 12 మంది ఎమ్మెల్యేలు, కేసీఆర్‌ మంత్రి వర్గంలో పనిచేస్తున్న ఏడెనిమిది మంది సభ్యులను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించేందుకు బలమైన, ధీ-టైన నేతలను పోటీ-కి పెట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ భారీ వ్యూహం రచించే పనిలో నిమగ్నమై ఉన్నట్టు- తెలుస్తోంది. పార్టీ మారిన 12 మందిని ఎన్నికల్లో దెబ్బతీయడం ద్వారా సత్తా చాటాలని ఒక పార్టీలో బీ-ఫామ్‌ తీసుకుని ఆ పార్టీ గుర్తుపై ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత వేరే పార్టీలోకి ఫిరాయిస్తే ఎలా ఉంటు-ందన్న విషయాన్ని తెలియజెప్పేందుకే ఎన్నికల్లో ఓడించి తీరాలన్న నిర్ణయానికి కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం వచ్చినట్టు- పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు.

రాజకీయ ప్రమాణాలను దిగజార్చి తద్వారా ప్రయోజనం పొందాలనుకునేవారికి ఎన్నికల్లో వచ్చే ఫలితం చెంపపెట్టు- కావాలన్నది తమ అభిమతమని ఆ నేత పేర్కొన్నారు. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారాసకు కనువిప్పు కలిగించే తీర్పును ప్రజలిచ్చే విధంగా వ్యూహం రచిస్తున్నామని, ఎన్నికల ఫలితం చూసి అధికార పార్టీ కళ్ళు బైర్లు కమ్మడం తథ్యమని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంటోంది. పార్టీలో కొనసాగడం ఇష్టం లేకపోతే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్తే ఎవరికీ ఎటు-వంటి అభ్యంతరం లేదని, అయితే పార్టీ ద్వారా గెలిచి ఇతర పార్టీలోకి దూకడం ఏ తరహా విధానం అని నిలదీసేందుకే ఈ నిర్ణయం అని కాంగ్రెస్‌ నేతలంటు-న్నారు.

పార్టీ మారినవారిలో మంత్రి సబితతో సహా 11 మంది
కేసీఆర్‌ మంత్రి వర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న పట్లోళ్ల సబిత ఇంద్రా రెడ్డితో పాటు- మరో 11 మంది ఎమ్మెల్యేలు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పక్షాన గెలిచి ఆ తర్వాత భారాసలో చేరిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువ మంది రిజర్వుడ్‌ నియోజక వర్గాల నుంచే పోటీ- చేసి గెలిచినవారే ఉన్నారు. బీరం హర్ష వర్ధన్‌ రెడ్డి (కొల్లాపూర్‌), రోహిత్‌ రెడ్డి (తాండూర్‌), సబిత (మహేశ్వరం), దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి (ఎల్బీ నగర్‌), గండ్ర వెంకట రమణా రెడ్డి (భూపాలపల్లి), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌), జాజల సురేందర్‌ (ఎల్లారెడ్డి), రేగ కాంతారావు (పినపాక), బానోతు హరిప్రియ (ఇల్లేందు), కందాల ఉపేందర్‌ రెడ్డి (పాలేరు), వనమా వెంకటేశ్వర రావు (కొత్తగూడెం), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్‌)లు కాంగ్రెస్‌లో గెలిచి కొంత కాలం పార్టీలో కొనసాగి ఆ తర్వాత అధికార పార్టీకి దగ్గరయ్యారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు- అప్పట్లో వారు ప్రకటించారు. ఈ 12 నియోజక వర్గాలతో పాటు- మునుగోడు అసెంబ్లీపై కూడా కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురవేయాలన్న పట్టు-దలతో ఆ పార్టీ వ్యూహం రచిస్తున్నట్టు- సమాచారం.

ఆరుగురు మంత్రులను ఓడించేందుకు స్కెచ్‌
తెలంగాణ రాష్ట్రంలో మంత్రులుగా పనిచేస్తున్న పువ్వాడ అజయ్‌, గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి, సబిత, నిరంజన్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, చామకూర మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డిలను ఓడించేందుకు వారు పోటీ- చేసే నియోజక వర్గాల్లో ఎవరిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్న అంశంపై ఇప్పటికే పార్టీ ముఖ్యుల సమావేశంలో సమాలోచనలు జరిపినట్టు- సమాచారం. కొందరు మంత్రులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లో ప్రయివేట్‌ ఏజెన్సీల ద్వారా సర్వేలు జరిపించుకుంటే ఫలితాలు ప్రతికూలంగా వచ్చినట్టు- కాంగ్రెస్‌ పార్టీకి సమాచారం అందింది. దీంతో ఒకరిద్దరు మంత్రులు మరో నియోజకవర్గంలో పోటీ-కి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. మరి ఈ ప్రతిపాదనకు భారాస అధినాయకత్వం అంగీకరిస్తుందా లేక ఇప్పటి నియోజక వర్గం నుంచి పోటీ- చేయాలని కోరితే పరిస్థితి ఏంటన్న ఆందోళనతో మంత్రులున్నారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పక్షాన గత ఎన్నికల్లో పోటీ- చేసి తమ స్వార్ధం కోసం అధికార పార్టీలో చేరిన వారికి శృంగభంగం తప్పదని, గత చరిత్ర కూడా ఇదే చెబుతోందని కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేత సత్తు మల్లేష్‌ వ్యాఖ్యానించారు. పార్టీ మారిన నేతల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత కనిపిస్తోందని, ఈ ప్రజాప్రతినిధుల పట్ల ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటు-ందని తామూ భావించలేదని మల్లేష్‌ పేర్కొన్నారు.

- Advertisement -

అభ్యర్థుల ఎంపికపై భారీ కసరత్తు
కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత అధికార పార్టీ వైపు మొగ్గుచూపిన స్థానాల్లో పార్టీ తరఫున ఉద్దండులను పోటీ-కి పెడుతున్నామని కాంగ్రెస్‌ చెబుతోంది. ఎవరూ ఊహించని అభ్యర్థులు పార్టీ తరపున ఎన్నికల బరిలో ఉంటారని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో పోటీ- చేసేందుకు తమకు అవకాశమివ్వాలని పెద్ద ఎత్తున నేతలు కోరుతున్నారని, సర్వేల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్న విషయాన్ని నేతలకు వివరించామని పార్టీ అగ్రనేత ఒకరు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement