Monday, July 1, 2024

Jumping ఎమ్మెల్యేల అనర్హత కోరుతూ సుప్రీం కోర్టు ను ఆశ్రయించనున్న బి అర్ ఎస్

హైద‌రాబాద్ : 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచిన ప‌లువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా తమ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాల‌ని బీఆర్ఎస్ పార్టీ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం

ఇప్పటికే ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి మూడు నెలలు పూర్తికావొస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ పార్టీ చర్చించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లో అనర్హత పిటిషన్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని నిబంధన ఉన్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నెంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనెల 27వ తేదీన హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపైన విచారణ ఉన్నది. హైకోర్టు వెంటనే న్యాయ ప్రకారం నిర్ణయం తీసుకొని… దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లేలా నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. దానం నాగేందర్‌తో పాటు ఇటీవ‌ల పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లాల‌ని బీఆర్ఎస్ నిర్ణయించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement