భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం కలిగించిన ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్‌రావు హత్య కేసులో ఇద్దరి నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.
వివరాలలోకి వెళితే గత ఏడాది నవంబర్ 25వ తేదిన పోకలగూడెం ఫారెస్ట్ బీట్‌లోని ప్లాంటేషన్ పనులను సందర్శించేందుకు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సెక్షన్ ఆఫీసర్ రామారావు వెళ్లగా గొత్తికోయలు పశువులు మెపుతుండటం గమనించారు. అక్కడి నుంచి వారిని వెళ్లిపోవాలని అధికారులు సూచించారు.. గుత్తికోయలను ఆ ప్లాంటేషన్ భూముల నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతుండగానే ఇద్దరు గుత్తికోయలు పదునైన ఆయుధాలతో దాడి చేశారు.. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావుని చికిత్స కోసం తరలిస్తుండగానే కన్నుమూశారు.. ఈ ఘటనకు కారణమైన ఇద్దరిని అప్పుడే అరెస్ట్ చేశారు.. నిందితులపై నేరం రుజువుకావడంతో ఆ ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు నేడు తీర్పు వెలువరించింది..