Monday, November 25, 2024

Judgement – గ్రేటర్ హౌసింగ్‌ సొసైటీలకు సుప్రీం షాక్ .. భూ కేటాయింపులు చెల్ల‌వంటూ తీర్పు

భూ కేటాయింపులు చెల్ల‌వంటూ తీర్పు
గ్రేట‌ర్ లో అధికారులు, ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులకు భూములు
సోసైటీల పేరుతో భూములు దారాద‌త్తం చెల్ల‌ద‌న్న సుప్రీం కోర్టు
సోసైటీలు ఇప్ప‌టి వ‌ర‌కు చెల్లించిన సోమ్ము రిఫండ్ ఇవ్వాల‌ని ఆదేశం

హైద‌రాబాద్ – అధికారులు, ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టు సొసైటీలకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రభుత్వాలు భూములు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ భూ కేటాయింపుల‌ను సుప్రీంకోర్టు ర‌ద్దు చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్‌ సొసైటీలకు ప్రభుత్వాలు భూ కేటాయింపులు చేయడాన్ని సవాల్‌ చేస్తూ రావు బీ చెలికాని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు భూ కేటాయింపుల‌ను ర‌ద్దు చేస్తూ తుది తీర్పును వెల్ల‌డించింది. అంతే కాకుండా సోసైటీలు భూములు కోసం ఇప్ప‌టి వ‌ర‌కు చెల్లించిన సోమ్మును వాటిని తిరిగి చెల్లించాల‌ని ఆదేశించింది.

కాగా, ఇటీవ‌ల‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీలో సభ్యులకు రేవంత్ రెడ్డి స‌ర్కార్ ఇళ్ల స్థలాలు కేటాయించిన సంగ‌తి తెలిసిందే. సెప్టెంబర్‌ 8న హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో ఇళ్ల‌ స్థలాల కేటాయింపు పత్రాలను సీఎం అంద‌జేశారు. అయితే తాజాగా వెలువ‌డిన‌ సుప్రీంకోర్టు తీర్పుతో హౌసింగ్‌ సొసైటీలు పొందిన ఈ భూముల విషయమై సందిగ్ధత‌ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement