Thursday, September 19, 2024

Judgement Day – అనర్హత ఎమ్మెల్యేలు – నేడు హైకోర్టు తీర్పు

హైదారాబాద్ – .అసెంబ్లీ ఎన్నికల్లొ గులాబీ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల భవితవ్యం నేడు తేలనుంది. వారి అనర్హత పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది..

పార్టీ ఫిరాయింపులను సీరియస్‌గా పరిగణించి ఒక పార్టీ గుర్తుపై గెలిచి అధికార పార్టీలో చేరిన వారిపై అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

కాగా, దానిపై నేడు ధర్మాసనం విచారణ జరపనుంది.ఒకవేళ హైకోర్టు పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా పరిగణించి అనర్హత వేయాలని స్పీకర్‌ను ఆదేశిస్తుందా? లేదా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఆదేశించినట్లు అయితే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు పడనుంది.

- Advertisement -

ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలివ్వాలని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించాయి.దీనిపై గత నెల 7న ఇరుపక్షాల వాదనలు పూర్తవ్వగా, కోర్టు తీర్పును రిజర్వు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement