Monday, November 25, 2024

Protest – కోల్‌క‌తా ఘ‌ట‌న‌పై కొన‌సాగుతున్న‌ డాక్ట‌ర్ల నిర‌స‌న‌లు

న‌ల్ల‌బ్యాడ్జిల‌తో జూడాల ర్యాలీ
ఐఎంఏ పిలుపుతో ఓపీ బ‌హిష్క‌ర‌ణ‌
నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాలి
ఇందిరా పార్కు వ‌ద్ద ధ‌ర్నా
అంత‌కు ముందు నిమ్స్ నుంచి ర్యాలీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : కోల్‌క‌తాలో జూనియ‌ర్ డాక్ట‌ర్‌పై జ‌రిగిన అమానుష సంఘ‌ట‌న‌కు బాధ్యుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుతూ రాష్ట్ర వ్యాప్తాంగా వైద్యులు ఓపీ విధుల‌ను బ‌హిష్క‌రించి నిర‌స‌న తెలిపారు. ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ పిలుపు మేర‌కు తెలంగాణ అంత‌టా ఓపీ సేవ‌ల‌ను వైద్యులు బ‌హిష్క‌రించారు. ప్రైవేటు, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఓపీ సేవ‌లు నిలిచిపోయాయి. ఉస్మానియ‌, గాంధీ ఆస్ప‌త్రిలో ఓపీలు నిలిచిపోవ‌డంతో ప‌లువురు రోగులు అవ‌స్థ‌లు ప‌డ్డారు. అత్య‌వ‌స‌ర కేసులు త‌ప్ప అన్ని సేవ‌లు బంద్ చేశారు.

ర్యాలీ.. ధ‌ర్నా..

- Advertisement -

ఆందోళ‌న‌లో భాగంగా హైద‌రాబాద్‌లో వైద్యులు ప‌లు చోట్ల ర్యాలీలు, ధ‌ర్నాలు చేప‌ట్టారు. నిమ్స్ నుంచి ఇందిరా పార్కు వ‌ర‌కు డాక్ట‌ర్లు ర్యాలీ నిర్వ‌హించారు. అలాగే ఇందిరా పార్కు ధ‌ర్నా చౌక్ వ‌ద్ద‌కు వంద‌లాది మంది డాక్ట‌ర్లు చేరుకుని ధ‌ర్నా చేశారు. డాక్ట‌ర్ల ఆందోళ‌న‌లో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటా పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

ఆదిలాబాద్‌లో…

ఆదిలాబాద్ నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి ,ఆసిఫాబాద్ మెడికల్ కళాశాలలతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీ సేవులు నిలిపి వైద్యులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కళాశాల విద్యార్థులు వందలాదిమంది ప్లకార్డులు పట్టుకొని హత్యాచార ఘటనపై గొంతెత్తి నినదించారు. పట్టణంలోని నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట మెడికల్ అందరూ మానవహారం గా ఏర్పడి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కళాశాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఓపి సేవలతోపాటు అన్ని రకాల సర్జరీలను నిలిపివేశారు. దీంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రోగులు పలు ఇబ్బందులు పడ్డారు.

రాఖీ క‌ట్టి… విన‌తి ప‌త్రం అంద‌జేత‌…

ఈ సందర్భంగా మెడికో విద్యార్థినులు జిల్లా కలెక్టర్ రాజార్శి షా కు వినతి పత్రం సమర్పించి క‌లెక్ట‌ర్‌కు రాఖీ కట్టారు. కాగా హత్యాచార ఘటనకు నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రిమ్స్ కళాశాల ఎదుట నిరసన ధర్నా చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement