Sunday, September 8, 2024

TS : ఎన్టీఆర్​కు జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్​రామ్ నివాళి​….

టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, దివంగ‌త సీఎం ఎన్టీఆర్ 101 జయంతి వేడుకలు నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం నందమూరి బాలకృష్ణ కూడా వచ్చి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. సినిమా రంగంలో ఆయన నటించిన సినిమాలు నేటి యువతకు ఆదర్శప్రాయమని తెలిపారు. ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ చేరుకోవడంతో అభిమానులు వారిని చూసేందుకు ఎగబడ్డారు.

- Advertisement -

ఎన్టీఆర్‌ ఓ శక్తి…9 నెలల్లోనే అధికారంలోకి వచ్చాడు అని నందమూరి బాలయ్య పేర్కొన్నారు. నందమూరి తారకరామరావు 101 జయంతి సందర్భంగా… ఆయనకు నివాళులు అర్పించారు నందమూరి బాలయ్య. ఈ సందర్భంగా నందమూరి బాలయ్య మాట్లాడారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మనవళ్లు కళ్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద అంజలి ఘటించారు. పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తమ తాతతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

స్వర్గీయ నందమూరి తారకరామా రావు 101 జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కొంతమంది రాజకీయ నేతలు ఎన్టీఆర్తో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తెలుగువారి గుండెచప్పుడు.. ఎన్టీఆర్‌ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఆయన అని కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన వెంకయ్యనాయుడు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

పురాణ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రజలను మెప్పించారని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. రాజకీయాల్లోనూ నవశకానికి ఎన్టీఆర్‌ నాంది పలికారని తెలిపారు. ఆయన .. దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారని.. నిరంకుశ రాజకీయాలకు ఎన్టీఆర్‌ ఎదురొడ్డి నిలిచారని పేర్కొన్నారు. గొప్ప సంస్కరణవాది.. నందమూరి తారక రామారావు అని వెంకయ్యనాయుడు కొనియాడారు.

మరోవైపు ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద తన తండ్రికి బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం అని.. నవరసాలకు అలంకారం అని.. నటనకు విశ్వవిద్యాలయం అని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తిని ఎంతోమంది అందిపుచ్చుకున్నారని తెలిపిన బాలయ్య .. తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ అని అన్నారు.

జూనియర్​ ఎన్టీఆర్​…
వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ తన తాతయ్య జయంతి సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశారు.”మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది.మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది.పెద్ద మనసుతో ఈ ధరిత్రిని ,ఈ గుండెను ,మరొక్కసారి తాకిపో తాత…సదా మీ ప్రేమకు బానిసను” అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు.

ఇక, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్కు కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ మహనీయుడు తనకు దైవ సమానులు అని, రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన నేత అని పేర్కొన్నారు.

తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకుడిని అని చెప్పిన ఎర్రబెల్లి.. 25 ఏళ్ల వయసులోనే తనకు ఎన్టీఆర్.. వరంగల్ జిల్లా పార్టీ పదవి ఇచ్చారని తెలిపారు. ఆయన ఆశీర్వాదంతోనే 26 ఏళ్లకే తాను ఎమ్మెల్యేగా పోటీ చేశానని వెల్లడించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ప్రస్తుత ప్రభుత్వాలు పని చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement