హైదరాబాద్, (ప్రభ న్యూస్) : హైదరాబాద్ సిటీ బౌల్డర్ హిల్స్‌లో బీజేపీ నేత, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనయుడు విశ్వజిత్, రిషిక వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. పెళ్లి జంట తల్లిదండ్రులు సంగీత, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రీతి, రాజేష్ రెడ్డి వేడుకకు హాజరైన అతిథులకు సాదరంగా స్వాగత సత్కారాలను అందించి రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించారు. వరుడి తాత, అమ్మమ్మ, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ.రెడ్డి, సుచరితరెడ్డి ఆనందభాష్పాలతో వేడుకలను ఆసాంతం ఆస్వాదించారు. దేశవ్యాప్తంగా పలువురు మంత్రులు, గవర్నర్లు, సన్నిహిత బంధుమిత్రులు రిసెప్షన్‌కు అతిథులుగా హాజరయ్యారు.