Friday, November 22, 2024

జర్నలిస్టులకు ఇండ్లస్థలాల కేటాయింపు – సిఎం, మంత్రి అజయ్ లకు టియుడబ్ల్యూజె కృతజ్ఞతలు

ఖమ్మం : జిల్లా కేంద్రంలో పని చేస్తున్న జర్నలిస్టుల నివాస స్థలాలకు సంబంధించి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల టియుడబ్ల్యూజె (ఐజెయు) ఖమ్మంజిల్లా కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది. గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో 23 ఎకరాల స్థలాన్ని జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం విధితమే. ముఖ్యమంత్రి కేసిఆర్ హామీ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి మేరకు ఈ స్థలాల కేటాయింపు జరిగిందని టియుడబ్ల్యూజె (ఐజెయు) జిల్లా కమిటీ తెలిపింది. సుదీర్ఘకాలంగా ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న ఖమ్మం జర్నలిస్టులకు అండగా నిలబడి ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా మంత్రి అజయ్ కుమార్ పట్టువదలని విక్రమార్కునిలా జర్నలిస్టులకు స్థలాల కేటాయింపు కోసం కృషి చేశారని ఐజెయు జిల్లా కమిటీ తెలిపింది. వీలైనంత త్వరలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలను అందజేయాలని కోరుతూ విశేష కృషి చేసిన మంత్రి అజయ్ కుమార్ కు ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికార యంత్రాంగానికి టియుడబ్ల్యూజె (ఐజెయు) కృతజ్ఞతలు తెలిపింది. కృతజ్ఞతలు తెలిపిన వారిలో టియుడబ్ల్యూజె (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, నగర అధ్యక్ష, కార్యదర్శులు మైసా పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాస్, ఖమ్మం ప్రెస్ క్లబ్ కా ర్యదర్శి కురాకుల గోపి, కోశాధికారి నామా పురుషోత్తం, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆలస్యం అప్పారావు, జాకీర్, ప్రెస్ క్లబ్ సభ్యులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement