ఆంధ్రప్రభ బ్యూరో ఆదిలాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క ఇవాళ ఉదయం ఆదిలాబాద్ లోని కాంగ్రెస్ ప్రజాభవన్ లో స్థానిక కాంగ్రెస్ నేతలతో భేటీ అయి పార్టీ పరిస్థితులు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువురు ఆదివాసీ నాయకులు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి సీతక్కకు అందజేశారు.
ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు సీతక్క సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, గిమ్మ సంతోష్, లోక ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీతక్క వరోర కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ మహాత్మా గాంధీ స్థాపించిన సేవాగ్రాo ఆశ్రమాన్ని సందర్శించి కుష్టు వ్యాధి నివారణ కేంద్రాన్ని సందర్శించనున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో మహాత్మా గాంధీ స్థాపించిన సేవాగ్రాo చరఖా, ఖాదీ గ్రామోద్యోగ్ సంస్థ కార్యకలాపాలను మంత్రి పరిశీలించనున్నారు.