Friday, November 22, 2024

జోగినిపల్లి సంతోష్ కుమార్ కి ప్రతిష్టాత్మక ‘ఛాంపియన్స్ ఆఫ్ ది చేంజ్’ అవార్డు

నిరంతరం మొక్కలు నాటేందుకు చేపట్టిన గ్రీన్​ ఇండియా చాలెంజ్​ కార్యక్రమానికి గాను ఎంపీ, టీఆర్​ఎస్​ నేత జోగినపల్లి సంతోష్​కుమార్​కు చాంపియన్స్​ ఆఫ్​ ది చేంజ్​ అవార్డు దక్కింది. పచ్చని ప్రకృతి కోసం.. భవిష్యత్ తరాల బాగు కోసం ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు సంతోష్ కుమార్. ఈ రోజు తాజ్ డెక్కన్ లో ప్రతిష్టాత్మకమైన ఐఎఫ్ఐఈ (ఇంటరాక్టివ్ ఫోరమ్ ఆన్ ఇండియన్ ఎకానమీ) సంస్థ అందిస్తున్న “ఛాంపియన్స్ ఆఫ్ ది ఛేంజ్” అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా జరిగింది. అయితే..  అధికారిక కార్యక్రమాల వల్ల అవార్డు స్వీకరణకు సంతోష్ కుమార్ అందుబాటులో లేని కారణంగా.. ఆయనకు బదులుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో -ఫౌండర్ రాఘవ ఈ అవార్డును సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ కే.జీ బాలకృష్ణన్ చేతుల మీదుగా స్వీకరించారు.

అవార్డు వేడుకకు అందుబాటులో లేని కారణంగా తన సందేశం పంపించిన సంతోష్ కుమార్ అందులో.. “సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఎన్ఆర్సీ మాజీ ఛైర్మన్ జస్టీస్ కే.జీ బాలకృష్ణన్” ఆధ్వర్యంలోని జ్యూరీ ఈ అవార్డుకు తనను ఎంపిక చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు.. అవార్డును తనకు అందించాలని నిర్ణయం తీసుకున్న “ఐఎఫ్ఐఈ ఛైర్మన్ నందన్ జా”కు  కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించినట్టుగా భావిస్తున్నాట్టు సంతోష్​ తెలిపారు.  “గాంధీజీ విలువల్ని ప్రజలకు చేరువ చేస్తూ, సంఘ సేవలు, సామాజిక అభివృద్ధికి పాటుపడే” వ్యక్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ “ఛాంపియన్స్ ఆఫ్ ది ఛేంజ్” అవార్డు సమాజం పట్ల గౌరవం, బాధ్యత ఉన్న ప్రతీ ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని ఆయన తెలిపారు. 

గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టాలని, గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించాలని, పచ్చగా తెలంగాణ పరిఢవిల్లాలని ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం ఇప్పటికే కోట్లాది ప్రజల్ని చేరిందని. వారితో కోట్లాది మొక్కల్ని నాటించిందని తన సందేశంలో సంతోష్​కుమార్​ వివరించారు. ఇది నిరంతరం కొనసాగిస్తామని, సంస్థల్ని, వ్యక్తుల్ని కలుపుకొని మరింత ఉధృతంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను ముందుకు తీసుకుపోతామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement