హైదరాబాద్ – సింగరేణి సంస్థలో 327 పోస్టులకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఏడు కేటగిరీల్లో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు తొలుత ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్న అధికారులు.. ఆ తేదీల్లో మార్పు చేశారు. వివిధ కారణాల వల్ల ఈ ప్రక్రియను వాయిదా వేసినట్లు వెల్లడించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మే 15న మధ్యాహ్నం 12గంటల నుంచి జూన్ 4 సాయంత్రం 5గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సింగరేణి వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
భర్తీ చేయనున్న పోస్టులివే..
ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో.. మేనేజ్మెంట్ ట్రైనీ(ఈఅండ్ఎం) ఈ2 గ్రేడ్- 42, మేనేజ్మెంట్ ట్రైనీ(సిస్టమ్స్) ఈ2 గ్రేడ్- 7.
నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో.. జూనియర్ మైనింగ్ ఇంజినీరు టీఅండ్ఎస్ గ్రేడ్ సీ- 100, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ(మెకానికల్) టీఅండ్ఎస్ గ్రేడ్ సీ- 9, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ(ఎలక్ట్రికల్) టీ అండ్ ఎస్ గ్రేడ్ సీ- 24, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1- 47, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ-1- 98 చొప్పున భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులైన అభ్యర్థులకు ఐదేళ్ల పాటు వయో సడలింపు ఉంది.