Saturday, November 23, 2024

జీవన్ లాల్ దాతృత్వం …చీమలపాడు ఘటన బాధితుని కుమార్తెకు చేయూత

ఇన్కమ్ టాక్స్ కమిషనర్ గా ఎప్పుడూ పని ఒత్తిడి తో ఉండే వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ తనయుడు లవుడ్యా జీవన్ లాల్ ఏమాత్రం అవకాశం దొరికినా ప్రజాసేవ, ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆర్థిక సహాయం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆదర్శవంతంగా అభినందనలు అందుకుంటున్నారు. ఒక వైపు తండ్రి ఎమ్మెల్యేగా వైరా నియోజకవర్గంలో అందిస్తున్న సేవలు, మరోవైపు తనయుడిగా పలువురికి చేస్తున్న ఆర్థిక సహాయ కార్యక్రమాలు వైరా నియోజకవర్గంలో ప్రజలచే అభినందనలు అందుకుంటున్నాయ


కారేపల్లి- ప్రభ న్యూస్


ఇటీవల మండలంలోని చీమలపాడు గ్రామంలో జరిగిన ప్రమాద ఘటనలో మృతి చెందిన బానోతు లక్ష్మణ్‌ కుమార్తె రాజేశ్వరి వారణాసి లో గల ఐఐటీలో చదువుతూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుండడంతో తెలిసిన వెంటనే జీవన్ లాల్ స్పందించారు. ఆ విద్యార్థికి చదువుల కోసం నిత్యం ఉపయోగపడే విధంగా రాష్ట్ర ఇన్కమ్‌ టాక్స్‌ కమిషనర్‌ గా ఉన్న లావుడియా జీవన్‌ లాల్‌ ల్యాఎ్టాప్‌ అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పేద కుటుంబానికి చెందిన రాజేశ్వరి తన తండ్రి అకాల మరణం చెందిన గాని ఎంతో గుండె నిబ్బరంతో చదువుకుంటున్నారు.

విద్యార్థిని బాగా చదివి ఉన్నత స్థితికి ఎదిగి మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా జీవలాల్‌ అన్నారు. ఘటన జరిగిన సందర్భంలో ఆ కుటు-ంబానికి అండగా ఉంటామని జీవన్‌ లాల్‌ ఇచ్చిన హామీ మేరకు ఈ ల్యాఎ్టాప్‌ ను అందించడం జరిగిందని పేర్కొన్నారు. పేద కుటుంబానికి సహాయం అందించిన జీవన్ లాల్ ను పలువురు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement