ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలు, ప్రజల్లోకి తీసుకెళ్లి, ఢిల్లీ వరకు ప్రజల గోసను వినిపించిన నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి గులాబీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ స్థాపనలో కేసీఆర్ తో నడిచి అభిప్రాయ బేదాలతో యువ తెలంగాణ పార్టీని స్థాపించి, భాజపా, అటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి భారాసలో చేరగా, భాజపాలో కొనసాగుతున్న జిట్టా వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తిరిగి మళ్ళీ కుంభం కాంగ్రెస్ లో చేరగా.. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ లో ఎవరికి వారే బల ప్రదర్శన నిర్వహించుకోవడం, భువనగిరి కాంగ్రెస్ టికెట్ బీసీలకు ఇవ్వాలని చెబుతూ సమావేశాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ భువనగిరి కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు జిట్టా బాలకృష్ణా రెడ్డిని కాసేపట్లో జరిగే బహిరంగ ప్రజా ఆశీర్వాద సభలో, లేదా మరో వారం రోజుల్లో గులాబీ పార్టీలో చేరేందుకు సిద్ధం చేసినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది.