Friday, November 22, 2024

TS: తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా జితేంద‌ర్ రెడ్డి…

ముఖ్య‌మంత్రి రేవంత్ స‌మ‌క్షంలో ఢిల్లీలో బాధ్య‌త‌లు
అభినందించిన మంత్రి పొంగులేటి, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులు

పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నేత ఏపీ జితేందర్ రెడ్డికి కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో ఆయన ఈరోజు ఉదయం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ హక్కుల కోసం కృషి చేస్తానన్నారు. విభజన అంశాల పరిష్కారం, కృష్ణానదిలో సమాన వాటా, రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల సాధన కోసం పని చేస్తానని చెప్పారు. మరోవైపు స్పోర్ట్స్ అడ్వైజర్ గా రాష్ట్రంలో క్రీడా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కృషి చేస్తానని, తెలంగాణను స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానన్నారు. 2036లో ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించే అవకాశం భారత దేశానికి వస్తే.. హైదరాబాద్ లోనూ కొన్ని ఈవెంట్ నిర్వహించేలా త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement