టిఆర్ ఎస్ పార్టీకి..అధినేతకి వీరాభిమాని ఈమెనని జిందం సత్తమ్మ అనే మహిళని పరిచయం చేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలను కేటీఆర్ వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకున్న జిందం సత్తమ్మ ఇప్పటికీ అదే స్ఫూర్తితో కొనసాగుతోందని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలోనే ఆమె టీఆర్ఎస్తో పాటు పార్టీ అధినేత కేసీఆర్‌కు వీరాభిమానిగా మారిపోయారన్నారు. నాటి నుంచి నేటి దాకా ఆమె తనకు మద్దతు పలుకుతున్నారని కూడా కేటీఆర్ తెలిపారు. జిందం సత్తమ్మ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారేనని … ఈ సందర్భంగా ఉద్యమ సమయంలో తనతో కలిసి కదం తొక్కిన సత్తమ్మ ఫొటోను కేటీఆర్ తన ట్వీట్‌కు జత చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement