Wednesday, November 20, 2024

New DGP – తెలంగాణ కొత్త డిజిపిగా జితేంద‌ర్ – ఉత్త‌ర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వం

తెలంగాణ కొత్త‌ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్ నియ‌మితుల‌య్యారు.. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు… ప్ర‌స్తుత డిజిపి ర‌వి గుప్తాను హోం శాఖ‌కు బ‌దిలీ చేశారు.. ఆయ‌న‌కు హోం శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. కాగా, జితేందర్ నేడు బాధ్యతలు స్వీకరించారు

- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ తో మర్యాద పూర్వక భేటి

కాగా, కొత్త డిజిపిగా నియమితులైన జితేందర్ నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు ఆల్ ద బెస్ట్ చెప్పారు.

1992 బ్యాచ్ … ఎపి కేడ‌ర్ లో విధులు

డీజీపీగా జితేందర్ ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్‌ 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయ‌న ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్‌ ఏఎస్పీగా పనిచేసిన అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారు. ఢిల్లీ సీబీఐలో.., 2004-06 వరకు గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. అనంతరం డీఐజీగా పదోన్నతి పొంది విశాఖ రేంజ్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పాలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్‌ రేంజ్‌ డీఐజీగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. తర్వాత తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన 2025 సెప్టెంబరులో పదవీవిరమణ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement