హైదరాబాద్ లోని కొంగర కలాన్ లో ఫాక్స్ కాన్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నిర్మాణం శరవేగంగా జరుగుతుండటంపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నిర్మాణానికి నాంది పలుకుతూ నెల రోజుల క్రితమే భూమిపూజ జరిగింది. ప్రాజెక్టు శరవేగంగా అభివృద్ధి చెందడాన్ని అభినందించిన మంత్రి, సైట్ లో జరుగుతున్న పనులను వివరిస్తూ ట్విటర్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.
ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న వేగాన్ని వివరించడానికి ‘తెలంగాణ స్పీడ్’ అనే పదాన్ని రూపొందించిన ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియు నుంచి కూడా ఈ ప్రాజెక్టు ప్రశంసలు అందుకుంది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫాక్స్కాన్ బృందం అసాధారణ పనితీరును కనబరుస్తోందనీ, ఇది వేగవంతమైన పురోగతికి మరింత దోహదం చేస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి
Just over a month ago, we had broken ground for the Foxconn plant at Kongara Kalan in RR District
— KTR (@KTRBRS) June 25, 2023
Happy to share a glimpse of the brisk progress of the project 😊
“Telangana speed” that the Foxconn chairman Mr. Young Liu alluded to is being adopted well by his team as well 👏 pic.twitter.com/CAY0z0TTJX