బి.కొత్తకోట: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బి.కొత్తకోట మండలం లో సచివాలయాలు ను, ఆర్భికే కేంద్రాలను జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ బాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంధర్బంగా బి.కొత్తకోట పట్టణం లోని నాలుగో సచివాలయానికి చాలామంది వలంటీర్లు హాజరు కాకపోవడం తో ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగసముద్రం రోడ్ లోని రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసి రైతు భరోసా కేంద్రం లో వచ్చినటువంటి స్పందన అర్జీలను ఆరా తీశారు. బి.కొత్తకోట కు వచ్చిన జేసీ కి బి.కొత్తకోట తహసీల్ధార్ నిర్మాలదేవి పై పలువురు ఫిర్యాదు చేశారు. పలు భూములకు సంబంధించిన ఆన్లైన్ కోసం తహసీల్ధార్ కార్యాలయానికి వెళ్తే ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాకుండా రైతులను తిప్పించుకొంటున్నారని తెలిపారు. తహసీల్ధార్ కార్యాలయంలో పనులు జరగాలంటే మధ్యవర్తులు ద్వారా ముడుపులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయని వాపోయారు. మీసేవ లలో తహసీల్ధార్ మాత్రమే భూములకు సంబంధించిన మ్యుటేషన్ అప్లికేషన్ లు తీసుకొంటున్నారని అని జేసీ కి రైతులు తమ గొడుని వెళ్లబోసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ నిర్మాలదేవి, ఆర్ఐ శ్రీనివాసులు, వీఆర్వో లు,సచివాలయ సిబ్బంది ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement