జనన నాట్య మండలి సీనియర్ కళాకారుడు, తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాత, జన హృదయ గేయ రచయిత జంగు ప్రహ్లాద్ కన్నుమూశారు. గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యన.. హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రజా కవిగా, జన నాట్య మండలిలో చురుకైన పాత్రతోపాటు తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటల ద్వారా కీలక భూమికను పోషించిన ప్లహ్లాద్.. మృతి కళామతల్లికి జన నాట్య మండలికి, కళాకారుల లోకానికి తీరనిలోటు.
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంకు చెందిన ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో ఉంటున్న ఆయన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యారు. ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా చికిత్స ఫలించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో జన నాట్య మండలి, కళామతల్లి కళాకారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని తెలిపుతూ ఆశృనివాళి అర్పిస్తున్నారు.
ఇది కూడా చదవండి: TS: హుజురాబాద్ లో ఈటల నమ్మింది ఎవరినో తెలుసా!