కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా తమ కార్యకర్తలపై కేసులు పెడుతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఇవాళ కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యక్తిగత కక్షతో బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తూ, కేసులు పెట్టిస్తున్నారన్నారు. జీవన్ రెడ్డి.. మీరు పెద్దలు ఇలాంటి పనులు చేయడం తగదన్నారు. ఎప్పటికైనా మళ్లీ మాకు మంచి రోజులు వస్తాయన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం.., ఇప్పుడు కూడా ఎదుర్కొంటామన్నారు. అభివృద్ధిని, ఇచ్చిన హామీలని పక్కనపెట్టి బీఆర్ఎస్ నాయకులపై కక్ష్యసాధింపు ఎందుకని ప్రశ్నించారు. పది సంవత్సరాల తమ ప్రభుత్వంలో కక్షపూరితంగా కేసులు పెట్టలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దు..,పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజల పొరపాటో, గ్రహ పాటో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, మేము ప్రతిపక్షంలో ఉన్నామన్నారు.