Monday, November 18, 2024

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష..

ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష సేపట్లో ప్రారంభంకానుంది. దేశంలోని 23 ఐఐటీల్లో సుమారు 16,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికోసం దేశవ్యాప్తంగా 1.7 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్‌, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో పేపర్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఈఏడాది ఐఐటీ ఖరగ్‌పూర్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను నిర్వహిస్తున్నది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కోసం రాష్ట్రం నుంచి సుమారు 14 వేల మంది అప్లయ్‌ చేసుకున్నారు. 15 పట్టణాల్లో ఆన్‌లైన్‌లో పరీక్ష జరగనుంది. ఈనెల 10న ప్రాథమిక సమాధానాలు, 15న ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు కరోనా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి: మోస‌గాళ్లు బాగుప‌డ‌లేర‌న్న సిద్దార్థ్..నిజ‌మేన‌న్న పూన‌మ్ కౌర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement