న్యూఢిల్లీ – జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ హైదరాబాద్ జోన్‌కు చెందిన తెలంగాణ విద్యార్థి వావిలాల చిద్విలాస్‌రెడ్డి (నాగర్‌కర్నూల్ జిల్లా) ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. టాప్ 10 ర్యాంకులలో ఆరుగురు తెలుగు విద్యార్దులు ఉండటం విశేషం.. టాప్ టెన్ ర్యాంకర్స్‌లో హైదరాబాద్ ఐఐటీ జోన్ విద్యార్థులు ఆరుగురు ఉన్నారు. వావిలాల చిద్విలాస్ రెడ్డికి 1వ ర్యాంకు, రమేష్ సూర్య తేజకు 2వ ర్యాంకు, అడ్డగడ వెంకట శివరామ్‌కు 5వ ర్యాంకు, బిక్కిన అభినవ్ చౌదరికి 7వ ర్యాంకు, నాగిరెడ్డి బాలాజీ రెడ్డికి 9వ ర్యాంకు, యక్కంటి పాణి వేంకట మనీంధర్ రెడ్డికి 10వ ర్యాంకు వచ్చింది. హైదరాబాద్ జోన్‌కే చెందిన మరో తెలంగాణ విద్యార్థి నాయకంటి నాగ భవ్యశ్రీ 298 మార్కులతో ఆలిండియా 56వ ర్యాంకు దక్కించుకుంది. చిద్విలాస్ రెడ్డి మొత్తం 360 మార్కులకు 341 మార్కులు సాధించాడు.
ఈ నెల 4న రెండు సెషన్లల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 1,80,226 మంది హాజరయ్యారు.ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల కాగా, ఆదివారం ముందు ఫైనల్ కీని విడుదల చేసిన ఆ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్‌ను ఐఐటీ గువాహటి నిర్వహించగా, సీట్ల భర్తీని ఆ సంస్థే చేపడుతున్నది. ఫలితా ల కోసం https:// jeeadv.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.