Friday, November 22, 2024

స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనండి – సిఎంల‌కు జెడి విన‌తి..

అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అత్య ంత కీలకమైన విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్లాంట్‌ను ప్రైవేటీ-కరించవద్దని బీఆర్‌ఎ స్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలం గాణ మంత్రి కేటీ-ఆర్‌ కేంద్రానికి లేఖ రాయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీ యాంశమౌతోంది. దీనిపై సీబీఐ మా జీ జాయింట్‌ డైరెక్టర్‌ వీవీ లక్ష్మీనారా యణ స్పందించారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాం ట్‌ ప్రైవేటీ-కరణను వ్యతిరేకిస్తూ కేటీ-ఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయన తీసుకున్న ఈ చర్యను తాను స్వాగతిస్త్తున్నానని వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో ఆయన ఏపీ, తెలంగాణ ప్రభు త్వాలకు ఒకట్రెండు సూచనలు కూడా చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీ-కరణ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం గనక వెనక్కి తగ్గకుంటే.. తెలంగాణ ప్రభుత్వం ముడి సరుకు సరఫరా, వర్కింగ్‌ క్యాపిటల్‌ను అందించే బిడ్లో పాల్గొనాలని జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా ఇదే వైఖరిని అనుసరించాల్సి ఉంటు-ందని సూచించారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇదే బిడ్‌లో పాల్గొనాలని సీఎం జగన్‌ను ప్రార్థిస్తున్నట్లు- చెప్పారు. ఈ మేరకు ఆయ న ఓ టీ-్వట్‌ చేశారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ముడి పదార్థాల సరఫరా, ప్లాంట్‌ నిర్వహ ణకు అవసరమైన వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్సెష్రన్‌ ఆఫ్‌ ఇం-టె-రెస్ట్‌) కేంద్ర ప్రభుత్వం జారీ చేసిందని జేడీ లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. ప్రైవేట్‌ కంపెనీల ప్రవేశాన్ని నిరోధించడానికి స్టీల్‌ అథారిటీ- ఆఫ్‌ ఇండియా లిమి-టె-డ్‌, నేషనల్‌ మినరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌, ఏపీ, తెలంగాణ లేదా ఇతర రాష్ట్రాల్ర ప్రభుత్వాలు ఈ బిడ్డింగ్‌ లో పాల్గొనాల్సి ఉంటు-ందని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement