Tuesday, December 3, 2024

MDK | దేశం మరువని దార్శనికుడు జవహర్ లాల్ నెహ్రూ.. నీలం మధు ముదిరాజ్

  • నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని నమ్మిన మహనీయుడాయన..
  • రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ..
  • 26రోజులపాటు రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు..

ఉమ్మడి మెదక్ బ్యూరో : భారతదేశ తొలి ప్రధానిగా, రాజనీతిజ్ఞుడుగా దేశ అభివృద్ధికి పునాదివేసిన దేశం మరువని దార్శనికుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. పండిత్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని గురువారం చిట్కుల్లోని నీలం మధు క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగిన భారతదేశ తొలి ప్రధానిగా దేశాన్ని అన్ని రంగాల్లో మహోజ్వల ప్రగతి సాధించేలా పాలన కొనసాగించారన్నారు. పంచవర్ష ప్రణాళికలను రూపొందించి ఆధునిక భారతం అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా కృషి చేశారని కొనియాడారు. నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని నమ్మిన నెహ్రూను చిన్నారులంతా ముద్దుగా చాచా నెహ్రు అని సంబోధిస్తారని ఆ మహానేత జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.

ఆ మహనీయుడు నెహ్రూ స్ఫూర్తితో తెలంగాణలో ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నిర్వీర్యమైన రంగాలను ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో మళ్లీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు. ఏడాదిలో జరిగిన అభివృద్ధిని ప్రజాక్షేత్రంలో తెలియజేయడానికి నెహ్రు జయంతి నుంచి 26 రోజులపాటు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ సైనికుడు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని స్పష్టంగా వివరిస్తూ విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement