ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:జన్వాడ ఫామ్‌హౌస్ ఘటనపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఒక వైపు డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తామని ప్రకటిస్తోందని.. మరోవైపు శని, ఆదివారాలు వచ్చాయంటే రేవ్ పార్టీలు, రావుల పార్టీల పేరుతో విచ్చలవిడిగా డ్రగ్స్ దందా జరుగుతోందన్నారు. విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు, కొకైన్ విచ్చల విడిగా తెచ్చి భాగ్యనగరంలో డ్రగ్స్ దందా చేస్తున్నారని ఫైర్ అయ్యరు.
శనివారం రాత్రి హైదరాబాద్ శివావర్లలో బాగా ఫేమస్ అయిన ఫామ్‌హౌస్‌లో అర్థరాత్రి రేవ్ పార్టీ జరుగుతోందని.. వీఐపీల పిల్లలు ఉన్నారని అనేక వార్తలు వచ్చాయని రఘునందన్ చెప్పారు. వీఐపీల పిల్లలుంటే నేరం నేరం కాకుండా పోతుందా.. ఎవరైనా సరే ఆధారాలుంటే అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.ఆ సీసీ టీవీ ఫుటేజీని రిలీజ్ చేయండి..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫామ్‌హౌజ్ ఒనర్తో కుమ్మక్కు కాకపోతే డీజీపీ ఆ ఫామ్‌హౌజ్ చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్‌ను వెంటనే రిలీజ్ చేయాలని ఎంపీ రఘునందన్ డిమాండ్ చేశారు.
12 గంటల్లోగా సీపీఫుటేజీని రిలీజ్ చేయాలని సీఎం రేవంత్‌ని, డీజీపీ జితేందర్‌ను డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. ఫామ్‌హౌజ్‌లో ఎస్ఓటీ పోలీసులు రెయిడ్ చేసినప్పుడు ఫామ్‌హౌజ్ లోపల, బయట ఉన్న సీసీ ఫుటేజీని వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రస్తుత సీఎం జన్వాడ ఫామ్ హౌజ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ రాజీ పడ్డారని వార్తలు వస్తున్నాయన్నారు.
12 గంటల్లోగా ప్రెస్ మీట్ పెట్టి వివరాలను వెల్లడించాలన్నారు. లేదంటే సీసీఫుటేజీ ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందన్నారు. రేవంత్ రెడ్డి పొల్యూట్ కాకపోతే జన్వాడ ఫామ్‌హౌజ్‌లో శనివారం రాత్రి ఏం జరిగిందనేది ప్రజలకు తెలియజేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.అసలేం జరిగిందంటే..మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడ శివారులో రాజ్ పాకాల ఫామ్‌హౌజ్‌లో రేవ్ పార్టీ నిర్వహించారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అర్థరాత్రి సమయంలో రెయిడ్ నిర్వహించారు. రేవ్ పార్టీని భగ్నం చేశారు. 35 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలున్నట్లు అధికారులు చెప్పారు. విజయ్ మద్దూరి అనే వ్యక్తికి కొకైన్ డ్రగ్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది.
ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ రెయిడ్‌లో విదేశీ మద్యం, భారీగా లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. క్యాసినో పరికరాలు సైతం స్వాధీనం చేసుకున్నారు. పలు ఎక్సైజ్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.